Warangal: వరంగల్లో ఘనంగా గాంధీ జయంతి, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు!
Warangal: వరంగల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన ప్రతిజ్ఞ, అన్నదానం మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Warangal: వరంగల్లో ఘనంగా గాంధీ జయంతి, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు!
Warangal: వరంగల్ మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ ఆధ్వర్యంలో నేడు పలు సేవా, సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.
అబ్బనీకుంటలో గాంధీజీకి ఘన నివాళులు
మొదటగా స్థానిక అబ్బనీకుంటలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ చైర్మన్ శ్రీ బేతి అశోక్ బాబు, TNGOS హనుమకొండ అధ్యక్షులు ఆకుల రాజేందర్ వైస్ చైర్మన్ శ్రీ శానబోయిన రాజ్ కుమార్ మరియు పాలక మండలి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్యక్రమానికి హాజరైన వారందరితో రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు.
సమాజంలో రక్తదానం పట్ల మరింత అవగాహన కల్పించడం, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేయడం రెడ్ క్రాస్ ముఖ్య లక్ష్యాలలో భాగమని నిర్వాహకులు తెలిపారు.
లేబర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం:
అనంతరం చేయూత గౌరవ సభ్యులు శ్రీ కుడికాల శ్యామ్ ఆధ్వర్యంలో లేబర్ కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ చైర్మన్ శ్రీ బేతి అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుడికాల శ్యామ్ చైర్మన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్ మరియు పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను కలిసిన రెడ్ క్రాస్ పాలక మండలి
అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ నూతన పాలక మండలి సభ్యులు తెలంగాణ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి శ్రీ బస్వరాజు సారయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీ సారయ్య గారు పాలక మండలి సభ్యులను సన్మానించి అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ భవిష్యత్తులో చేపట్టబోయే సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలు మరియు నిరుపేదలకు సేవలు అందించడం వంటి అంశాలపై పరస్పరం చర్చించారు.
పాల్గొన్న వారు
ఈ కార్యక్రమాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ చైర్మన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, పాలక మండలి సభ్యులు కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, తోట సంపత్ కుమార్, మండల పరుష రాములు, పుల్లూరు ప్రవీణ్ కుమార్, హనుమకొండ TNGOs అధ్యక్షులు, JAC చైర్మన్ ఆకుల రాజేందర్, బైరి సోమన్న కుడికాల వేణు లక్ష్మీ ప్రసాద్ మూడేడ్ల సతీష్, బేతి రాజు, అబ్బనీకుంట వాస్తవ్యులు గడ్డమీది రాజేష్, బంక కుమారస్వామి, లకుం రవి, అనుముల జనార్ధన్, అడ్వకేట్ సురేష్, సాగర్, ఆడేపు రవి, అరుణ్ తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ చైర్మన్ బేతి అశోక్ బాబు మాట్లాడుతూ, “గాంధీజీకి నివాళి కేవలం పూలమాలతోనే కాకుండా, ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా నిజమైన నివాళి అర్పించాలి. ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందిస్తూ, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలు మరియు నిరుపేదలకు సహాయం వంటి కార్యక్రమాలను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరింత విస్తృతంగా నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు.




