Jangaon: ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆక్రమణలు తొలగించాలి ప్రజావాణిలో ఫిర్యాదు
Jangaon: జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆక్రమణలు తొలగించాలని ప్రజావాణిలో కోలేపాక సూర్యం అధికారులకు ఫిర్యాదు చేశారు.
Jangaon: ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆక్రమణలు తొలగించాలి ప్రజావాణిలో ఫిర్యాదు
Jangaon: నర్మెట్ట మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఎంఆర్ఓ ఈజీఎస్ తదితర ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రధాన రహదారిపై ప్రైవేట్ వ్యక్తుల వ్యాపార కార్యకలాపాలు నిర్మాణాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు అందజేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతిరోజూ వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారని అయితే కార్యాలయాల ముందు ఉన్న ప్రాంతంలో హోటళ్లు జిరాక్స్ సెంటర్ తదితర ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదుదారు కోలెపాక సూర్యం పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉన్న స్థలాన్ని అధికారులు పరిశీలించి ప్రభుత్వ స్థలం లేదా రహదారి పరిధిలో ఆక్రమణలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం తొలగించాలని కోరారు అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే మార్గాన్ని ఖాళీగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై అధికారులు స్థల పరిశీలన నిర్వహించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోలెపాక సూర్యం కోరారు.




