Palakurthi: గూడూరు ఎస్సీ హాస్టల్‌ను పునరుద్ధరించాలి: మారం రవి కుమార్
Palakurthi: గూడూరులో రూ.21 లక్షలతో నిర్మించిన ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉండటంపై విచారణ జరిపి పునరుద్ధరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ డిమాండ్ చేశారు.
Palakurthi: గూడూరు ఎస్సీ హాస్టల్‌ను పునరుద్ధరించాలి: మారం రవి కుమార్
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ భవనాన్ని బీజేపీ నాయకులు చిక్కుడు అశోక్, మొగిలి వంశి ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థుల వసతి కోసం దాతలు ఉచితంగా అందించిన ఎకరం భూమిలో, ప్రభుత్వ నిధులతో రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉండటం బాధాకరమన్నారు.
ప్రస్తుతం ఎస్సీ బాలుర హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతుండగా, గూడూరులోని ప్రభుత్వ భవనం వినియోగంలో లేకపోవడంపై అధికారుల నిర్లక్ష్యమే కారణమా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవనాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి, అర్హులైన విద్యార్థుల ప్రయోజనార్థం తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
జిల్లా కలెక్టర్, సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు దొంగరి మహేందర్,కడుదుల నిరంజన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సోమేశ్వర్, సీనియర్ నాయకులు కాసోజు సమ్మయ్య చారీ తదితరులు పాల్గొన్నారు.




