Parkal: పరకాలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

Parkal: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.

M PRABHAKAR, PARAKAL
Published on: 15 Aug 2026 2:16 PM IST
Parkal
X

Parkal: పరకాలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!

Parkal: పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.లక్షలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మితమైన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి పథంలో నడిపించిందని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలు నేటి తరానికి ఆదర్శప్రాయమని, వారి దేశభక్తి, సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story