Hanamkonda: భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి!

Hanamkonda: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో భూ రీసర్వే ప్రక్రియను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Sept 2026 12:12 PM IST
Hanamkonda
X

Hanamkonda: భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి!

Hanamkonda: భూముల రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీసర్వే నిర్వహించాలి. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీసర్వే కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా రీసర్వే ప్రక్రియ కొనసాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సంబంధించిన భూముల వివరాలను పారదర్శకంగా, క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియపై రైతులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. రీసర్వే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, సందేహాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు

.రైతులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. రీసర్వే ప్రక్రియలో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి, వారికి అవసరమైన సహకారం అందించాలని అన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL