Mahabubabad: రెండు పోలియో చుక్కలతోనే జీవితకాల ఆరోగ్య రక్షణ: రోటరీ!
Mahabubabad: రైల్వే స్టేషన్‌లో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు పోలియో చుక్కలను ఘనంగా పంపిణీ చేశారు.
Mahabubabad: రెండు పోలియో చుక్కలతోనే జీవితకాల ఆరోగ్య రక్షణ: రోటరీ!
మహబూబాబాద్: పోలియో రహిత సమాజమే రోటరిక్లబ్ లక్ష్యమని మహబూబాబాద్ రోటరిక్లబ్ అధ్యక్షులు వేమిశెట్టి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారంనాడు స్థానిక రైల్వేస్టేషన్లో రోటరిక్లబ్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరిక్లబ్ వ్యవస్థాపకులు మాలె నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ లీడర్లు వద్దుల సురేందర్ రెడ్డి, బిక్కి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వేమిశెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎంతోమంది పిల్లలకు రోటరీ సౌజన్యంతో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు.
ఐదేళ్లలోపు పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా జీవితకాలం ఆరోగ్య రక్షణ కలుగుతుందన్నారు. ఈ పోలియో చుక్కల ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరిగి ప్రాణాంతక వ్యాధుల నుండి విముక్తి చెందుతారని అన్నాడు. సేవకు పర్యాయపధంగా నిలుస్తున్న మహబూబాబాద్ రోటరిక్లబ్ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రజాయుత కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తుచేశారు.
ప్రపంచశాంతి, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై స్ఫూర్తిదాయకంగా పనిచేస్తోందన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళా స్వయం ఉపాది లక్ష్యంగా ఉన్నతమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు.ఇంకా ఈకార్యక్రమంలో మహబూబాబాద్ రోటరిక్లబ్ ట్రేజరర్ శంతన్ రామరాజు, సీనియర్ రొటేరియన్లు బోనగిరి గిరిధర్ గుప్తా, ముల్లంగి మోహన్ రెడ్డి, వల్లాల రమేష్ తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




