Dornakal: రూ.800 కోట్లతో డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే!

Dornakal: డోర్నకల్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తెలిపారు. సీరోల్‌లో నూతన పీహెచ్‌సీ, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 23 Nov 2026 7:00 PM IST
Dornakal
X

Dornakal: రూ.800 కోట్లతో డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే!

మహబూబాబాద్ జిల్లా: సీరోల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిళా సమాఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా మహబూబా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు మరిపెడలో వంద పడగల ఆసుపత్రి, కురవి మండలంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి గ్రామంలో రూ. కోటి కి తగ్గకుండా సిసి రోడ్ల నిర్మాణo చేపట్టినట్లు పేర్కొన్నారు.సీరోల్ మండలం లో రూ. 37 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి పనులు చేపట్టామని భవిష్యత్తులోనూ మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతామని ఆయన వెల్లడించారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL