RTC Strike: ముత్తోజిపేటకు చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం
RTC Strike: వరంగల్‌లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతితో ఉద్రిక్తత నెలకొంది. ఆయన అంత్యక్రియలకు నేతలు హాజరు కానున్నారు.
RTC Strike: ముత్తోజిపేటకు చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం
RTC Strike: వరంగల్‌లోని ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం చేరుకుంది. ఈ క్రమంలో ముత్తోజిపేటకు ఆర్టీసీ కార్మికులు, నేతలు భారీగా చేరుకుంటున్నారు. శంకర్‌గౌడ్ అంత్యక్రియల్లో కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొననున్నారు. మరోవైపు ముత్తోజిపేటలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇదిలా ఉంటే.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు నిరసన తెలుపుతున్నారు. శంకర్‌గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ నినాదాలు చేస్తున్నారు. తక్షణమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నారు.
మరో వైపు ఆర్టీసీ బస్సులు బంద్ కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు.




