Mahabubabad: ఆర్టీసీ ఉద్యోగుల గర్జన.. ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్
Mahabubabad: మహబూబాబాద్‌లో ఆర్టీసీ సమ్మె ఉధృతం. 76 బస్సులు డిపోకే పరిమితం కావడంతో బస్టాండ్ వెలవెలబోయింది.
Mahabubabad: ఆర్టీసీ ఉద్యోగుల గర్జన.. ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం లో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.బస్ డిపో నుంచి బయటకు వెళ్తున్న హైర్ బస్సులను ఉద్యోగులు అడ్డుకొని బస్సుల ముందు బైఠాయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సమ్మెతో మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో 76 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వెలవెలబోతోంది.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన అంశాలైన ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని , పీ.ఆర్.సి ని
ప్రకటించాలని , విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే ఇవ్వాలని , ఉద్యోగ సంఘాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో కష్టనష్టాలకు ఓర్చి ప్రభుత్వానికి మంచి పేరును తీసుకువస్తున్నామన్నారు.
40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం నిమ్మకు నిరీత్తినట్లు ఉందని , కంటి తుడుపు చర్య గా ఐఏఎస్ లతో కమిటీ వేసిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షం లో ఆందోళనా కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.




