Hanumakonda: హనుమకొండలో సదర్ సయ్యాట – 2026 వేడుకలు!

Hanumakonda: హనుమకొండ కెయుసి రోడ్డులో నవంబర్ 14న నిర్వహించనున్న సదర్ సయ్యాట-2026 వేడుకల ఆహ్వాన పత్రికను తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్‌కు అందజేసిన శ్రీకృష్ణ యాదవ కమిటీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Nov 2026 11:34 AM IST
Hanumakonda
X

Hanumakonda: హనుమకొండలో సదర్ సయ్యాట – 2026 వేడుకలు!

Hanumakonda: కాజీపేట, హనుమకొండ జిల్లా గారిని వారి నివాసంలో శ్రీకృష్ణ యాదవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సదర్ సయ్యాట వేడుకల విశిష్టతను వివరించి, కార్యక్రమానికి విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ వేడుకలు నవంబర్ 14వ 2026 , శనివారం సాయంత్రం 6 గంటల నుంచి హనుమకొండలోని యాదవ నగర్ సర్కిల్, KUC రోడ్డులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీకృష్ణ యాదవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, ఆత్మీయతను చాటిచెప్పే ఈ సదర్ సయ్యాట వేడుకల్లో యాదవ సోదరులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు...

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్