Jangaon: జనగామ ఉమామహేశ్వర ఆలయంలో సహస్ర ఘటాభిషేకం
Jangaon: జనగామ గుండగడ్డ కాలనీలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో సహస్ర ఘటాభిషేకం వైభవంగా జరిగింది.
Jangaon: జనగామ ఉమామహేశ్వర ఆలయంలో సహస్ర ఘటాభిషేకం
Jangaon: జనగామ జిల్లా గుండగడ్డ కాలనీలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో నిర్వహించిన సహస్ర ఘటాభిషేకం కార్యక్రమంలో జనగామ జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సహస్ర ఘటాభిషేకంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని రైతులు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఉమామహేశ్వర స్వామిని ప్రార్థించారు
ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు అయ్యగారు సాంబమూర్తి శర్మ వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు డీసీపీకి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో భక్తులు చుంచు విగ్నేష్ ధర్మపురి శ్రీనివాస్ పంతులు ప్రభాకర్ రావు తాటికుమార్ ప్రకాష్ కాచం నరసింహరావు రాణి రేణుక అనురాధ ఉమా తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.




