Kesamudram: ఆశా కార్యకర్త స్వరూపను పరామర్శించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత
Kesamudram: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఆశా కార్యకర్త స్వరూపను సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మి గౌడ్ పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Kesamudram: ఆశా కార్యకర్త స్వరూపను పరామర్శించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న కోరుకొండపల్లి గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త స్వరూపను సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మి గౌడ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల శస్త్రచికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న స్వరూప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా స్వరూప భర్త నాగెల్లి వెంకన్న, పిల్లలు వంశితేజ, ఇంద్రతేజ, కుటుంబ సభ్యులు నాగెల్లి జనార్దన్, రమలను కలిసి ఓదార్పు పలికిన సమ్మి గౌడ్, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం అంటూ భరోసా ఇచ్చారు. ఆయన చూపిన మానవత్వానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎండనకా, వాననకా సేవలు అందించే ఆశా వర్కర్లు నిజమైన ఆరోగ్య యోధులు.
ప్రతి ఇంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులకు అంకితభావంతో సేవలందించే స్వరూపలాంటి కార్యకర్తలు సమాజానికి ఆదర్శం. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, సామాజిక సేవలను తన బాధ్యతగా భావిస్తున్న సమ్మి గౌడ్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం చేయడం, విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
అవసర సమయంలో ప్రజలకు తోడుగా నిలుస్తూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారని స్థానికులు కొనియాడుతున్నారు. ఆశ కార్యకర్త స్వరూప చేసిన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ, ఆమె త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆమె పాత్ర చిరస్మరణీయమని పలువురు అభిప్రాయపడ్డారు.




