Bhupalpally: భూపాలపల్లిలో చిన్నారుల వినూత్న రోడ్డు భద్రతా అవగాహన!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో సంకల్ప్ పాఠశాల విద్యార్థులు పోలీసుల సహకారంతో గులాబీ పూలు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనలపై వినూత్నంగా అవగాహన కల్పించారు.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 26 Aug 2026 8:06 AM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లిలో చిన్నారుల వినూత్న రోడ్డు భద్రతా అవగాహన!

Bhupalpally: ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్‌కు సంబంధించిన చిత్రాలతో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులకు గులాబీ పూలు అందిస్తూ వినూత్న రీతిలో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం పాట రూపంలో రోడ్డు భద్రత ఆవశ్యకతను వివరిస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఎస్సై గీత, పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించాలని, వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించకూడదని సూచించారు. చిన్నారుల ద్వారా వాహనదారులకు అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు...

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story