Warangal: వరంగల్‌లో ఘనంగా సంకల్ప సిద్ధి యోగ శిక్షణ శిబిరం!
Warangal: వరంగల్ ఓసిటి మైదానంలో సంకల్ప సిద్ధి యోగ శిక్షణ శిబిరం నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని గురూజీ రుషి రవికుమార్ తెలిపారు.
Warangal: వరంగల్‌లో ఘనంగా సంకల్ప సిద్ధి యోగ శిక్షణ శిబిరం!
Warangal: వరంగల్ నగరంలోని ఓసిటి మైదానంలో శనివారం కోరే వెంకటస్వామి, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఓసిటి వాసులకు యోగ, ప్రాణాయామం, ధ్యాన శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రుషి రవికుమార్ గురూజీ యోగ శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ.. యోగా అంటే అందరూ కేవలం ఆసనాలు అనుకుంటారని, కానీ యోగా అంటే ప్రాణవాయువు అని అన్నారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారని, అప్పుడే ప్రశాంతమైన జీవితం గడపగలరని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 30 నిమిషాలు యోగాకు కేటాయించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓసిటి వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగ శిక్షణ పొందారు. నిర్వాహకులు వెంకటస్వామి, లక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
వరంగల్ ఓసిటి మైదానంలో నిర్వహించిన యోగ శిబిరంలో యోగాసనాలు వేస్తున్న ఓసిటి వాసులు. చిత్రంలో రుషి రవికుమార్ గురూజీ, నిర్వాహకులు వెంకటస్వామి, లక్ష్మి.




