Hanumakonda: కంటాత్మకూర్‌లో ఉపాధి హామీ పనులు ప్రారంభం!

Hanumakonda: హనుమకొండ జిల్లా కంటాత్మకూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్ కొంగంటి తిరుపతి. 120 రోజుల పని కల్పించడమే లక్ష్యమని వెల్లడి.

M PRABHAKAR, PARAKAL
Published on: 22 Oct 2026 10:05 AM IST
Hanumakonda
X

Hanumakonda: కంటాత్మకూర్‌లో ఉపాధి హామీ పనులు ప్రారంభం!

Hanumakonda: నడికూడ మండలంలోని కంటాత్మకూర్ గ్రామంలో ఈదుల చెరువు వద్ద వి.బి.జి. రాంజీ (VB-G RAM G) ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ 120 రోజుల పాటు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకుంటూనే ఎల్ నినో ప్రభావం, కరువు నుంచి బయటపడాలంటే రైతులు, కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బుస్సా భాగ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, రైతులు, కూలీలు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL