Dornakal: పెద్దతండాలో కేసీఆర్ చిత్రపటానికి సత్యవతి రాథోడ్ పాలాభిషేకం!
Dornakal: కురవి మండలం పెద్దతండాలో కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాలాభిషేకం, ర్యాలీ. గిరిజన రిజర్వేషన్ల పెంపునకు 4 ఏళ్లు పూర్తి.
Dornakal: పెద్దతండాలో కేసీఆర్ చిత్రపటానికి సత్యవతి రాథోడ్ పాలాభిషేకం!
Dornakal: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బిందు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన రోజును గిరిజన సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన సమయంలోనే తాను చెప్పులు విడిచానని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తిరిగి చెప్పులు ధరిస్తానని భావోద్వేగంగా తెలిపారు.
గిరిజన ఆదివాసీ సమాజాన్ని ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడుతానని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆమె విమర్శించారు. గిరిజనుల సంక్షేమం, రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఆమె ప్రస్తావించారు.




