Mahabubabad: బీజేపీ, కాంగ్రెస్‌లపై సత్యవతి రాథోడ్ ఘాటు విమర్శలు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Jun 2026 3:50 PM IST
Mahabubabad
X

Mahabubabad: బీజేపీ, కాంగ్రెస్‌లపై సత్యవతి రాథోడ్ ఘాటు విమర్శలు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయం లో మీడియా సమావేశం కామెంట్స్. కేసీఆర్, బిఆర్ఎస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. గిరిజనుల వెనుకబాటుకు ప్రధాన కారకులు కాంగ్రెస్ , బీజేపీ పార్టీ లే కారణం.

ఒక్క గిరిజన బిడ్డ ను రాష్ట్రపతి ని చేస్తే గిరిజనులందరి కడుపు నిండదు. దేశం లో కడుపు నిండా అన్నం తినకుండా ఎంతో మంది గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. బిజేపీ కి గిరిజనుల పై ప్రేమ ఉంటే బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ను ఏర్పాటు చేయాలి.

డిల్లీ లో సేవాలాల్ భవన్ ను నిర్మించి , దేశ వ్యాప్తంగా సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహించాలి. జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించాలి. పెరిగిన గిరిజన జనాభా కు అనుగుణం గా రిజర్వేషన్ లను పెంచాలని డిమాండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనులను చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తున్నారు.

ఆంధ్రాలో 1956 లోనే ఎరుకల యానాదుల కు ST రిజర్వేషన్ లు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనే 1976 వరకు రిజర్వేషన్ లు రాలేదు , 20 సంవత్సరాల పోరాటంతో 1976 లో రిజర్వేషన్లు వచ్చాయి. గిరిజనులకు రిజర్వేషన్లు లభించి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయని సంబరాలు చేసుకుంటూ రోడ్ల పై తిరుగుతున్నారు.

ఢిల్లీకి బస్సు యాత్ర చేయాలి, సుప్రీంకోర్టులో కేసు కొట్టి వేశాకే ఈ ప్రాంతానికి రావాలి , లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story