Mahabubabad: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో DRM ఆకస్మిక తనిఖీ!
Mahabubabad: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ (DRM) డాక్టర్ గోపాలకృష్ణ మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Mahabubabad: మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో DRM ఆకస్మిక తనిఖీ!
Mahabubabad: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ (డి.ఆర్.ఎం) డాక్టర్ గోపాల కృష్ణ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రైల్వే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని అమృత్ భారత్ లో బాగంగా 40 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి నిర్మాణపు పనులను డి.ఆర్. ఎం పరిశీలించారు.
బుకింగ్ కార్యాలయం, ఎక్స్ కవేటర్, స్టేషన్ ప్రాంగణం, తదితర కనిర్మాణపు పనులను పరిశీలించారు. నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు అనతరం ఇంటికన్నే రైల్వే బ్రిడ్జ్ పనులను పరిశీలిచారు
ఈ తనిఖీలలో సీనియర్ డి.ఎస్. ఓ సురేష్ కుమార్, డి.ఓ.ఎం సురేష్ వర్మ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, అన్ని శాఖల రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




