Seerole: 7 రకాల వరి వంగడాల సాగు - ఆన్‌లైన్ నమోదుకు గడువు పెంపు

Seerole: సీరోలు మండలంలో 7 రకాల వరి వంగడాల సాగు మరియు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 10 లోపు పూర్తి చేయాలని MAO ఛాయా రాజు తెలిపారు. వివరాలు ఇక్కడ చూడండి.

P PRABHAKAR, DORNAKAL
Published on: 2 Sept 2026 11:55 PM IST
Seerole
X

Seerole: 7 రకాల వరి వంగడాల సాగు - ఆన్‌లైన్ నమోదుకు గడువు పెంపు

సీరోలు: వానాకాలం–2026లో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 రకాల వరి వంగడాల సాగును ప్రోత్సహించడం. డీలర్ వద్ద విత్తనం కొనుగోలు చేసిన రైతుల వివరాలను డీలర్ ద్వారా పోర్టల్‌లో నమోదు చేయాలి. స్వంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి పొందిన విత్తనం ఉపయోగించే రైతులు రైతు ధృవీకరణ పత్రం సమర్పించాలి.

AEO వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి; MAO 100% ధృవీకరణ చేయాలి. మొత్తం రైతు డేటా ఎంట్రీ, ధృవీకరణ ప్రక్రియను 10-09-2026లోపు పూర్తి చేయాలి. అర్హత ఉన్న రైతులెవరూ డేటా నమోదు ప్రక్రియలో మిగిలిపోకుండా ప్రత్యేకంగా గుర్తించాలి.

గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, వాట్సాప్ గ్రూపులు, మీడియా తదితర మార్గాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. ఈ యొక్క డేటా ను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు అందిస్తారు , వారు మాత్రమే కొనుగోలు కేంద్రాలు కు మరియు 500 బోనస్ కు అర్హులు.

ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి,ఛాయా రాజు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL

Next Story