Parkal: 8 నెలలుగా నత్తనడకన రోడ్డు పనులు.. హనుమకొండ జిల్లాలో ప్రజల రోడ్డెక్కడం!

Parkal: హనుమకొండ జిల్లా పరకాల-హనుమకొండ ప్రధాన రహదారి పనులు 8 నెలలుగా నిలిచిపోవడంతో సీతారాంపురం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 23 Oct 2026 10:03 AM IST
Parkal
X

Parkal: 8 నెలలుగా నత్తనడకన రోడ్డు పనులు.. హనుమకొండ జిల్లాలో ప్రజల రోడ్డెక్కడం!

Parkal: అధికారుల నిర్లక్ష్యానికి, కాంట్రాక్టర్ నిర్వాకానికి పరకాల - అంబాల - హనుమకొండ ప్రధాన రహదారి నిదర్శనంగా మారింది. గత 8 నెలలుగా రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీతారాంపురం గ్రామస్తులు చివరకు రోడ్డెక్కారు.

అసంపూర్తిగా వదిలేసిన రోడ్డుతో నిత్యం దుమ్ము దూళితో గ్రామస్తులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్డుపై వెళ్తే కళ్లు కనిపించని పరిస్థితి. ఇళ్లు, మొత్తం దుమ్ముమయం. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో అల్లాడుతున్నారు. వ్యాపారులకు వ్యాపారం లేక విలవిలలాడుతున్నారు.

ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా, ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. కనీసం రోజుకు మూడుసార్లు అయినా వాటర్ తో స్ప్రే చేయాల్సింది ఉండగా చేయాల్సింది ఉండగా అది కూడా చేయట్లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL