Mahabubabad: ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా

A.Rajkumar, Mahabubabad
Published on: 6 July 2026 2:49 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నం!

మహబూబాబాద్: విద్యార్థుల పెండింగ్ స్కాలర్ షిప్ లు విడుదల చేసి , విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్.ఎఫ్.ఐ అధ్వర్యంలో విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని , శిధిలావస్థలో ఉన్న పాఠశాలు , కళాశాలలు , వసతి గృహాల కు నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలెక్టరేట్ ఎదుట పోలీసులు భారీగా మొహరించారు.విద్యార్థులు కలెక్టరేట్ లోనికి వెళ్లకుండా భారీ కేడ్లు పెట్టారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story