Bhupalpally: కేటీకే-1 ఇంక్లైన్‌లో విషాదం: సింగరేణి కార్మికుడు మృతి!
Bhupalpally: కేటీకే-1 ఇంక్లైన్‌లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతి. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గండ్ర ఆందోళన.
Bhupalpally: కేటీకే-1 ఇంక్లైన్‌లో విషాదం: సింగరేణి కార్మికుడు మృతి!
Bhupalpally: భూపాలపల్లి కేటీకే-1 ఇంక్లైన్‌లో విషాదం చోటుచేసుకుంది. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ గోపి (40) తీవ్ర ఛాతినొప్పితో కుప్పకూలి మృతి చెందాడు. అంబులెన్స్‌లో డాక్టర్ లేకపోవడమే గోపి మృతికి కారణమని కుటుంబ సభ్యులు, కార్మికులు ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతిని యాక్సిడెంట్ డెత్‌గా పరిగణించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆందోళనకు మద్దతు తెలిపారు.
అత్యవసర వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సింగరేణిని డిమాండ్ చేశారు.
Next Story




