Sircilla: జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపే గొప్ప కళాకారులు ఫోటోగ్రాఫర్లు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్మైల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.
Sircilla: జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపే గొప్ప కళాకారులు ఫోటోగ్రాఫర్లు
Sircilla: జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో స్మైల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా మనుషుల భావోద్వేగాలు, ప్రకృతి అందాలు, చారిత్రక క్షణాలను శాశ్వత జ్ఞాపకాలుగా నిలిపే గొప్ప కళాకారులని కొనియాడారు.
ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ వేడుకల్లో అందమైన జ్ఞాపకాలను చిత్రీకరించి చిరస్థాయిగా నిలిపే ఫోటోగ్రాఫర్ల కృషి వెలకట్టలేనిదని అన్నారు. స్మైల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం జిల్లా కేంద్రంలో "ఫోటో భవన్" నిర్మాణానికి స్థలం కేటాయింపు అంశాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి దిలీప్, మాజీ అధ్యక్షుడు వంకాయల కార్తీక్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




