Kuravi: అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం.. కురవిలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Kuravi: బక్రీద్ పండుగ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ కురవి చెక్‌పోస్ట్‌ను అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 13 May 2026 7:18 PM IST
Kuravi
X

Kuravi: అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం.. కురవిలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Kuravi: బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టుల పనితీరును జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ అర్ధరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఇందులో భాగంగా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అక్రమ పశువుల రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలని, చెక్‌పోస్ట్ ద్వారా వెళ్లే ప్రతి వాహనాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించి అవసరమైన పత్రాలను పరిశీలిస్తూ, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, షిఫ్ట్ విధానంలో సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తులు లేదా పారిపోయే వాహనాల సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story