Bhupalpally: భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆఫీస్‌లో 80వ స్వాతంత్య్రదినోత్సవం
Bhupalpally: భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించి, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ సంకీర్త్.
Bhupalpally: భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆఫీస్‌లో 80వ స్వాతంత్య్రదినోత్సవం
Bhupalpally: భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సేవకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మరింత సన్నిహితంగా ఉంటూ, వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరంగా వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు.
అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ మిఠాయిలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డిఎస్పి సూర్యనారాయణ, ఏవో ఫర్హానా, ఆర్ఐ లు, డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




