Hanamkonda: కార్తీక మాసం సందర్భంగా పంచారామాల దర్శనానికి ప్రత్యేక బస్సులు

Hanamkonda: కార్తీక మాసం పురస్కరించుకుని హనుమకొండ డిపో నుంచి ఏపీ పంచారామాలు, అరుణాచలం, శబరిమల, తెలంగాణ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 7:26 PM IST
Hanamkonda
X

Hanamkonda: కార్తీక మాసం సందర్భంగా పంచారామాల దర్శనానికి ప్రత్యేక బస్సులు

హన్మకొండ: కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలైన పంచారామాలకు హనుమకొండ నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని రామప్ప శ్రీ రామలింగేశ్వరాలయం, లక్న వరం సరస్సు, మేడారం సమ్మక్క - సారలమ్మ, మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, బొగత జలపాతం, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం లతో పాటు హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధి చెందిన పంచరామ క్షేత్రాలైన అమరావతి , ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట లలోని స్వామి వార్లను దర్శించుకునేలా ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు.

అంతేకాకుండా తమిళనాడులోని అరుణాచలంకు కూడా నడపడం జరుగుతుందని తెలిపారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలై దేవస్థానానికి భక్తుల డిమాండ్ కు అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని, మరిన్ని వివరాల కోసం 8977781103, 9493882464, 9949193893 లను సంప్రదించాలని డిఎం తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్