Warangal: ఎంజీఎం ఆస్పత్రి పనులు వేగవంతం కావాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
Warangal: వరంగల్ ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు.
Warangal: ఎంజీఎం ఆస్పత్రి పనులు వేగవంతం కావాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్: నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
ఆదివారం వరంగల్ ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులలో భాగంగా వెలుపల జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, వివిధ విభాగాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ ఎస్‌ఈ సురేష్ బాబు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఆర్ అండ్ బీ ఈఈ దేవిక చౌహాన్, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.




