Station Ghanpur: స్టేషన్ ఘన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం కారు ఢీకొని మహిళ మృతి!
Station Ghanpur: స్టేషన్ ఘన్పూర్ మీదికొండ క్రాస్ వద్ద కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో కామల్ల ఐలమ్మ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Station Ghanpur: స్టేషన్ ఘన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం కారు ఢీకొని మహిళ మృతి!
స్టేషన్ ఘనపూర్: బుధవారం సాయంత్రం ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమా దంలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు గాయపడినట్లు సమా చారం.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ ఘన్పూర్ పట్టణానికి చెందిన కామల్ల ఐలమ్మ, నీరటి మౌనిక, పిట్టల రేణుక, నక్క సునీత, చొక్కం సరోజన, యతం రాజ్యలక్ష్మి తదితరులు వ్యవసాయ పనులు ముగించుకుని ఆటోలో స్టేషన్ ఘన్పూర్కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మీదికొండ క్రాస్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎస్ 27 టీ 7986 నంబరు గల కారు..ఏపీ 03 టీ 0105 నంబరు గల ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో కామల్ల ఐలమ్మ(55)తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడు గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు పోలీస్స్టే షన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.




