Station Ghanpur: జీవో 97కి వ్యతిరేకంగా పాలిటెక్నిక్ సిబ్బంది నిరసన
Station Ghanpur: స్టేషన్‌ఘన్‌పూర్‌లో జీవో 97ను వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ సిబ్బంది నిరసన ర్యాలీ. జీవోను పునఃపరిశీలించి ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్.
Station Ghanpur: జీవో 97కి వ్యతిరేకంగా పాలిటెక్నిక్ సిబ్బంది నిరసన
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్టేషన్‌ఘన్‌పూర్ సిబ్బంది తమ నిరసన గళాన్ని వినిపించారు. జీవో 97ను వ్యతిరేకిస్తూ కళాశాల నుంచి శివునిపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో నంబర్ 97ను పునఃపరిశీలించాలని, ఉద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. జీవో 97పై పునరాలోచన చేసి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి” అని డిమాండ్ చేశారు
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని వారు కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని పాలిటెక్నిక్ సిబ్బంది స్పష్టం చేశారు.
ఈ ర్యాలీలో పాలిటెక్నిక్ సెంట్రల్ జేఏసీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, లోకల్ జేఏసీ అధ్యక్షుడు సిహెచ్. యాదయ్య, ప్రిన్సిపల్ గంగారెడ్డితో పాటు ధనుంజయ్, శ్రీధర్ రెడ్డి కిరణ్ కుమార్, రవీందర్, సుకన్య, అనిల్ కుమార్, జావేద్ పాషా నరేష్, జితేందర్, ప్రశాంత్ రాజు తదితరులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
“వినతిపత్రం స్వీకరించి ప్రభుత్వం స్పందించాలి”
జీవో 97పై తక్షణమే నిర్ణయం తీసుకుని ఉద్యోగుల ఆందోళనకు పరిష్కారం చూపాలని పాలిటెక్నిక్ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు...




