Mahabubabad: మహబూబాబాద్‌లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమీక్షా సమావేశం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష; నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలని హెచ్చరిక.

A.Rajkumar, Mahabubabad
Published on: 21 Aug 2026 8:41 AM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమీక్షా సమావేశం!

Mahabubabad: ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్క దారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ , ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న ఆయనకు అధికారులు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ లో భూములు , సర్వీస్ , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....ఎస్సీ, ఎస్టీ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని , ప్రమోషన్లలో రోస్టర్ రిజర్వేషన్లు తప్పనిసరిగా పాటించాలని , ఎస్సీ, ఎస్టీలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని , ఈ కార్యక్రమాలకు తహశీల్దార్లు, ఎస్‌.ఐలు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ స్నేహా శభరీష్, ఎస్పీ శబరీష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story