Bhupalpally: భూపాలపల్లిలో దందాలా సాగుతున్న సిండికేట్ మద్యం దందా!

Bhupalpally: భూపాలపల్లిలో సిండికేట్ మద్యం దందా కలకలం తెల్లవారుజామునే బెల్ట్‌షాపులకు ఆటోల్లో అక్రమ మద్యం సరఫరాపై ఆరోపణలు.

RAJU, BHUPALAPALLI
Published on: 9 Sept 2026 1:22 PM IST
Bhupalpally
X

Bhupalpally: భూపాలపల్లిలో దందాలా సాగుతున్న సిండికేట్ మద్యం దందా!

Bhupalpally: భూపాలపల్లిలో మద్యం సిండికేట్ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటలకే బెల్ట్‌షాపులకు మద్యం తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారులను తప్పించుకుని ఆటోల ద్వారా గ్రామీణ మార్గాల్లో మద్యం సరఫరా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

బెల్ట్‌షాపులకు సరఫరా చేసే మద్యంపై ఒక్కో బీర్‌కు రూ.20, క్వార్టర్‌పై రూ.20–30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుభాష్ కాలనీలో గోదాం ఏర్పాటు చేసి అక్కడి నుంచి సరఫరా చేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

కుప్పలు తెప్పలుగా బెల్ట్‌షాపులు.. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ నిఘా ఎక్కడ? తెల్లవారుజామునే అక్రమ మద్యం రవాణా జరుగుతున్నా అధికారులు గుర్తించలేకపోతున్నారా? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమ సరఫరా మూలాలను ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story