Raghunathapally: ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ డెడ్‌లైన్
Raghunathapally: గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్‌పోర్ట్ జాప్యంపై ఆగ్రహం.. జూన్ 1 నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆందోళనల డెడ్‌లైన్.
Raghunathapally: ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ డెడ్‌లైన్
రఘునాథపల్లి: అశ్వరావు పల్లి,వెల్ది గ్రామాలలోని ఐకెపి సెంటర్ ను సందర్శించిన తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య రైతులు పండించిన పంటలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ మొండి వైఖరిని వీడాలని నినాదాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు రెండు నెలలు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటివరకు కనీసం సగం వడ్లు కొనుగోలు చేయని వైనం. ఒకవైపు గన్ని బ్యాగుల కొరత మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం.
వడ్లు ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో విసిగి వేసారిలా రైతులు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం చెప్పినట్లుగా మే 31వ తేదీ వరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి. కానీ ఇప్పటివరకు ధాన్యం ఐకెపి సెంటర్లలోనే మగ్గుతుంది.
ధాన్యం కొనుగోలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించిన డాక్టర్ రాజయ్య జూన్ 1వ తేదీ నుండి బిఆర్ఎస్ పార్టీ రైతులను కలుపుకొని ధర్నాలు రాస్తారోకోలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి ఎర్రోళ్ల కుమార్ గౌడ్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముసిపట్ల విజయ్,మాజీ సర్పంచ్ మండల అధ్యక్షుడు పెండ్లి మల్లా రెడ్డి జిల్లా నాయకులు గూడ కిరణ్ కొర్ర రాజేందర్ నాయక్ వెల్ది ఉపసర్పంచ్ ఎడ్ల బాలరాజు నాయకులు గోనె మల్లారెడ్డి పెండ్లి భూపాల్ రెడ్డి ఆంజనేయులు శ్రీకాంత్ కృష్ణ, భూక్య రాజు తదితరులు పాల్గొన్నారు.




