Bhupalpally: భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట బొగ్గు గని కార్మికుల నిరసన!
Bhupalpally: సింగరేణి లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని, పనిముట్లు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు.
Bhupalpally: భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట బొగ్గు గని కార్మికుల నిరసన!
భూపాలపల్లి: భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల సమస్యలపై TBGKS నాయకులు ఆందోళనకు దిగారు. గత సంవత్సరం సింగరేణి ఉత్పత్తిలో వచ్చిన లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి GM కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా TBGKS నాయకులు మాట్లాడుతూ... గతంలో BRS ప్రభుత్వం హయాంలో సింగరేణి లాభాల వాటాను ఆరు నెలల ముందుగానే ప్రకటించేవారని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు లాభాల వాటాను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు.
సింగరేణి కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించాలని, వారికి అవసరమైన పనిముట్లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల విషయంలో మాత్రం మొండిచేయి చూపిస్తోందని TBGKS నాయకులు విమర్శించారు.




