Parkal: ఇనాం, పోడు భూములకు శాశ్వత పట్టాలివ్వాలి.. టీడీపీ నేత!
Parkal: ఇనాం, సీలింగ్, పోడు భూములు సాగు చేసుకుంటున్న పేద రైతులకు ప్రభుత్వం శాశ్వత పట్టాలు ఇవ్వాలని టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేష్ డిమాండ్ చేశారు.
Parkal: ఇనాం, పోడు భూములకు శాశ్వత పట్టాలివ్వాలి.. టీడీపీ నేత!
Parkal: పరకాల రాష్ట్రంలో ఏళ్లుగా ఇనాం, సీలింగ్, భూదాన్, అసైన్డ్, పోడు భూములను సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు నేటికీ భూమిపై హక్కు లేకపోవడం బాధాకరమన్నారు. దీనివల్ల రైతు భరోసా, రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఈ భూములను సమగ్రంగా సర్వే చేసి, అర్హులైన పేదలకు చట్టబద్ధమైన పట్టాలు జారీ చేయాలన్నారు. భూమిలేని నిరుపేదలకు, ముఖ్యంగా దళితులకు న్యాయం చేసి వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.




