Warangal: వరంగల్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ భేటీ.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం!
Warangal: వరంగల్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సింగిల్ పర్మిట్ సమస్యలు, అక్రమ అసోసియేషన్ పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు డిమాండ్ చేశారు.
Warangal: వరంగల్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ భేటీ.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం!
వరంగల్: వరంగల్ లోని SS5 ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటి సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లారీ యజమానులు ఎదుర్కొంటున్న సింగిల్ పర్మిట్, కౌంటర్ సిగ్నేచర్, స్టిక్కర్లు వంటి సమస్యలపై చర్చించారు.
వరంగల్ లో మరో అసోసియేషన్ పేరుతో దౌర్జన్యంగా తక్కువ కిరాయిలకు బయటి లారీలతో ట్రేడింగ్ నిర్వహిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్న వంగాల సమ్మిరెడ్డి, వేముల శ్రీకాంత్, అఫ్జల్ లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు, చాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ ద్వారా విన్నవించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ రావు, అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చాంద్ పాషా, వరంగల్ జిల్లా అధ్యక్షులు వేముల భూపాల్, కోశాధికారి N.P. జాకీర్ తో పాటు లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




