Warangal: నకిలీ వైద్యులపై ఉక్కుపాదం.. ముగ్గురిపై కేసులు నమోదు!
Warangal: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీలు. వరంగల్-హనుమకొండ ప్రాంతంలో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్న నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు.
Warangal: నకిలీ వైద్యులపై ఉక్కుపాదం.. ముగ్గురిపై కేసులు నమోదు!
Warangal: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) వరంగల్-హనుమకొండ ప్రాంతంలో నకిలీ వైద్యులపై కొరడా ఝళిపించింది. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న ముగ్గురిపై FIRలు నమోదు చేయించింది.
TGMC విజిలెన్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వీరు MBBS లేదా చట్టబద్ధమైన వైద్య అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు.
FIR నమోదైన వారి వివరాలు:
గుర్రపు రామకృష్ణ - రామకృష్ణ క్లినిక్, ఫోర్ట్ వరంగల్. FIR నం. 741/2026, ఏజే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్. MBBS అర్హత లేకపోయినా డాక్టర్‌గా ప్రచారం చేసుకుంటూ IV మందులు, యాంటీబయాటిక్స్, షెడ్యూల్-H మందులు, ఇంజెక్షన్లు అందిస్తున్నట్లు గుర్తింపు. గతంలో కూడా ఇతనిపై కేసు నమోదై ఛార్జ్‌షీట్ దాఖలైంది.
ఏ. కుమారస్వామి - రాజరాజేశ్వరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, సోమిడి రోడ్, విష్ణుపురి, కాజీపేట. అర్హత లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు.
నకిలీ వైద్యుల వద్ద చికిత్స పొందడం ప్రాణాలకే ప్రమాదమని, అనుమానాస్పద క్లినిక్‌లపై తమ దృష్టికి తీసుకురావాలని TGMC ప్రజలకు విజ్ఞప్తి చేసింది.




