Mahabubabad: భారీ చోరీ.. రూ.4 లక్షల నగదు, బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాహుల్ నగర్ కాలనీలో పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి రూ.4 లక్షల నగదు, সাড়ে 5 తులాల బంగారం చోరీ చేశారు.
Mahabubabad: భారీ చోరీ.. రూ.4 లక్షల నగదు, బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు!
Mahabubabad: ఇంటికి తాళం వేసి షాప్ కు వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్ చేసిన దొంగలు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి నాలుగు లక్షల రూపాయల నగదుతో పాటు 5.1/2 తులాలు బంగారు, 40 తులాల వెండి ఆభరణాలను చోరీ చేసిన
సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని రాహుల్ నగర్ కాలనీ లో చోటు చేసుకుంది.
కొవ్వాకుల రమేష్ కుటుంబం నివాసముంటున్న ఇల్లు... రోజూ లాగే ఇంటికి తాళం వేసి పాత ఇనుము షాప్‌కు వెళ్లారు రమేష్ దంపతులు.ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు , కష్టపడి సంపాదించి చేయించుకున్న బంగారు , వెండి ఆభరణాలు కళ్లముందే మాయమవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు... పట్టపగలే తమ చేతివాటం ప్రదర్శించారు. ఇంటి ప్రధాన ద్వారం తాళాలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన నగదు, బంగారు, వెండి ఆభరణాలను లక్ష్యంగా చేసుకున్నారు.
షాప్‌కు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన రమేష్ దంపతులకు... పగులగొట్టిన ఇంటి తాళాలు, చిందరవందరగా పడివున్న వస్తువులు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.పట్ట పగలే ఇంటి తాళాలు పగులగొట్టి భారీ మొత్తం లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కష్టపడి సంపాదించిన సొమ్ముకు ఇంట్లోనే భద్రత లేకుండా పోతోందా? తాళం వేసిన ఇళ్లే దొంగలకు టార్గెట్‌గా మారుతున్నాయా? అన్న ఆందోళన రాహుల్ నగర్ కాలనీ వాసుల్లో వ్యక్తమవుతోంది. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పోలీసులు త్వరితగతిన గుర్తించి, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
జీవనాధారం కోసం చిరు వ్యాపారం చేసుకుంటూ... కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటే... దొంగలు ఒక్కసారిగా ఇంటిని గుల్ల చేశారు. జీవితకాల కష్టార్జితం కళ్లముందే దోచుకెళ్లడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.




