Mulugu: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీల మధ్య నలిగిన డ్రైవర్
Mulugu: ములుగు జిల్లా చిన్నబోయినపల్లి వద్ద బస్సును ఓవర్‌టేక్ చేస్తూ లారీని ఢీకొట్టిన టిప్పర్. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను కాపాడిన స్థానికులు.
Mulugu: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీల మధ్య నలిగిన డ్రైవర్
ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి వస్తున్న ఓ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో టిప్పర్ లారీ అదుపు తప్పి, ముందు వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Next Story




