Wardhannapet: కోటిలింగల హత్యోదంతంపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం

Wardhannapet: కోటిలింగలలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఆడపు మహేష్ దారుణ హత్యకు గురికావడంపై టీపీసీసీ అధ్యక్షులు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 July 2026 12:23 AM IST
Wardhannapet
X

Wardhannapet: కోటిలింగల హత్యోదంతంపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం

వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజక వర్గం గీసుకొండ మండలం కోటిలింగలలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆడపు మహేష్ దారుణ హత్యకు గురైన సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలకు హింస ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం కాదని ఆయన పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన అన్నారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story