Palakurthi: గూడూరులో 'ఎన్ షాపింగ్ మాల్'ను ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి!

Palakurthi: గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఎన్ షాపింగ్ మాల్'ను లాంఛనంగా ప్రారంభించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

S MAHENDER, PALAKURTHI
Published on: 12 Oct 2026 3:38 PM IST
Palakurthi
X

Palakurthi: గూడూరులో 'ఎన్ షాపింగ్ మాల్'ను ప్రారంభించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి!

Palakurthi: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల.ఝాన్సీ రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వ్యాపార సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు అవసరమైన వస్తువులు సులభంగా లభించడంతో పాటు, వ్యాపార అభివృద్ధికి కూడా దోహదపడతాయని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల స్వరూప పుల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మార్కెట్ చైర్మన్ లావుడియా మంజుల భాస్కర్, ఆత్మ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, షాపింగ్ మాల్ యాజమాన్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI