Warangal: వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై డిమాండ్!
Warangal: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బంజారా సామాజిక వర్గానికి చెందిన నెహ్రూ నాయక్‌కు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని గిరిజన సంఘాల నాయకులు కోరారు.
Warangal: వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై డిమాండ్!
Warangal: రాబోయే వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బంజారా సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించాలని బంజారా నాయకులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు నాయకులు రవీంద్ర నాయక్, ముదిరాజ్ సంఘం నాయకుడు సురేష్, రవి నాయక్ మాట్లాడారు.
నెహ్రూ నాయక్ కు అవకాశం కల్పించాలని అన్ని బంజారా సంఘాలతో పాటు ముదిరాజ్, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల సైతం మద్దతు పలుకుతున్నాయని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన లంబాడాలకు
ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు రానందున కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థిగా లంబాడీలకు అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అన్ని సంఘాలతో కలుపుకొని గెలిపించుకుంటామని చెప్పారు.




