Jangaon: బతుకమ్మ కుంట వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి!

Jangaon: సీసీ కెమెరాలు, సెక్యూరిటీని నియమించాలని టీఆర్‌పీ యూత్ జిల్లా అధ్యక్షుడు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 13 Aug 2026 5:16 PM IST
Jangaon
X

Jangaon: బతుకమ్మ కుంట వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి!

జనగామ: జనగామ జిల్లా టిఆర్పి యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో స్థానిక బతుకమ్మ కుంటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మరియు సెక్యూరిటీని నియమించాలని జనగామ పట్టణ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్ల సదానందం ముదిరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముఖ్యంగా బతుకమ్మ కుంటలో సీసీ కెమెరాలు లేకపోవడం వలన కొంతమంది అసాంఘిక శక్తులు అందులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంతేకాకుండా రాత్రి సమయాలలో బర్తడే ల పేర్లతో కొంతమంది మద్యం సేవించి సీసాలను ట్రాక్లపై పలగొట్టడం సిగరెట్ పీకాలను పడేయడం వంటి దుస్సహాసాలకు ప్రయత్నం చేస్తున్నారు కావున సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా వాటిని నిరోధించవచ్చని వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మరియు ముఖ్యంగా బతుకమ్మకుంటలో కోతుల వలన చిన్నపిల్లలు వాకర్సు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కావున వెంటనే తగు చర్యలు తీసుకోవాలని నేడు మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ యూత్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి బాబా యామంకి విజయ్ జిల్లా కార్యదర్శి వరికుప్పల గంగరాజు విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ పట్టణ సంయుక్త కార్యదర్శి సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story