Bhupalpally: భూపాలపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ప్రెస్‌మీట్
Bhupalpally: భూపాలపల్లిలో తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నల్లమల శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు చేశారు.
Bhupalpally: భూపాలపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్ ప్రెస్‌మీట్
భూపాలపల్లి: బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత నమ్మవద్దని వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నల్లమల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నల్లమల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని ఆరోపించారు.
ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవితక్క ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ముందుంటామని తెలిపారు.
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్లమల శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.




