Hanumakonda: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు..TRSV హెచ్చరిక!

Hanumakonda: దసరా సెలవుల్లో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే సహించేది లేదని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హెచ్చరించింది.

MD. AMEER, WARANGAL EAST
Published on: 10 Oct 2026 5:07 PM IST
Hanumakonda
X

Hanumakonda: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు..TRSV హెచ్చరిక!

Hanumakonda: హన్మకొండ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను విద్యార్థులకు అమలు చేయకుండా, స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల తీరును తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం ప్రకటించిన సెలవులను విద్యాసంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని, సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సెలవులు నిరాకరించడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగి, విశ్రాంతికి అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన సెలవులను తక్షణమే అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల సహకారంతో ఆయా విద్యాసంస్థల్లో తరగతుల బహిష్కరణ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో. T.R.S.V వరంగల్ జిల్లా నాయకులు పోగుల సుతేజ్ హనుమకొండ జిల్లా నాయకులు బుజగుండ్ల మహిధర్ శివ, రతన్ రాజ్, వరుణ్, ఇమ్రాన్ ఖాన్ ఇతరులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST