Chelpur: విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగుల భారీ ధర్నా!

Chelpur: ఈ నెల 19న హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కేటీపీపీ వద్ద ఉద్యోగుల పోస్టర్ ఆవిష్కరణ.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 17 Aug 2026 10:56 AM IST
Chelpur
X

Chelpur: విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగుల భారీ ధర్నా!

Chelpur: తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19 న నిర్వహించనున్న విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా ను విజయవంతం చేయాలని జెన్ కో ఉద్యోగులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు కు ఘనపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వద్ద 19న తలపెట్టనున్న మహాధర్నకు సంబంధించిన పోస్టర్ను ఉద్యోగులు ఆవిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద ఉదయం 11 గంటలకు చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని PRC-2026 అమలు, యాదాద్రి ప్లాంట్ ఔట్ సోర్సింగ్ నిలిపివేయాలని.

పెండింగ్ ప్రమోషన్లు, ఖాళీల భర్తీ, పాత పెన్షన్ విధానం అమలు, GPF, EPF, విద్యుత్ సంస్థల ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల తో ఈ మహా ధర్నా చేపడుతున్నట్టు తెలిపారు .

ఈ మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story