Jangaon: ప్రముఖ సామాజిక సేవకుడు మాజిద్ అఫ్సర్‌కు ఘన సన్మానం!

Jangaon: జనగామలో ప్రముఖ సామాజిక సేవకుడు మాజిద్ అఫ్సర్‌ను TSMESA జిల్లా శాఖ ఘనంగా సన్మానించింది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 1 Aug 2026 4:32 PM IST
Jangaon
X

Jangaon: ప్రముఖ సామాజిక సేవకుడు మాజిద్ అఫ్సర్‌కు ఘన సన్మానం!

జనగామ: గత ముప్పై సంవత్సరాలుగా మైనారిటీల సంక్షేమం విద్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకులు మాజిద్ అఫ్సర్ గారిని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TSMESA) జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా TSMESA జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి మాట్లాడుతూ మాజిద్ అఫ్సర్ గారు గత మూడు దశాబ్దాలుగా మైనారిటీల అభ్యున్నతి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మైనారిటీల సంక్షేమం కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సన్మానానికి స్పందించిన సన్మాన గ్రహీత మాజిద్ అఫ్సర్ గారు మాట్లాడుతూ ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని భవిష్యత్ లో కూడ మైనారిటీల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు యువత సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనీ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తన సేవలను గుర్తించి సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మహ్మద్ తహసీన్ మహ్మద్ అఫ్జల్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ మాజిద్ అఫ్సర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మైనారిటీల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు భవిష్యత్తులో కూడా వారు మరిన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్షు ప్రసాదించి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాజిద్ అఫ్సర్ గారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహ్మద్ అంకుషావలి మహమ్మద్ తహసీన్ మహ్మద్ అఫ్జల్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story