Warangal: జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వరంగల్‌లో నిరసన!
Warangal: వరంగల్‌లో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ TUWJ 143 ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Warangal: జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వరంగల్‌లో నిరసన!
Warangal: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని , ఇప్పటికైనా వెంటనే జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఆర్ లెనిన్ డిమాండ్ చేశారు.
శుక్రవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కోరు కొప్పుల నరేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సీఎంకు ఉత్తరాలు, గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిఆర్. లెనిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ద్వంద వైఖరిని ప్రదర్శిస్తుందని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినప్పటికిని ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ లో ఇళ్ల మంజూరి,జర్నలిస్టుల సంక్షేమం, అక్రిడేషన్ల జారీ విషయాలలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు.
ఈరోజు ఐజేయు యూనియన్ కూడా నిరసన తెలుపడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఐజేయునేత మీడియా అకాడమీ చైర్మన్ గా ప్రభుత్వం లో ఉన్నారని, పనులు చేయించాల్సింది పోయి వాళ్లే నిరసన కార్యక్రమాలకు చేపట్టడం దురదృష్టకరమైన విషయం అన్నారు. వరంగల్ లో జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేయకపోవడం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు.
ఇప్పటికైనా వెంటనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడంతో పాటు వరంగల్లో జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకునేందుకు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో TUWJ H-143 రాష్ట్ర నాయకులు చిలుముల సుధాకర్ తడక రాజనారాయణ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీధర్ రెడ్డి, కక్కెర్ల అనిల్ కుమార్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకే శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నవనీత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నీలం శివ, బండి రవి, కమటం వేణు, బండి రాజు, ముజాహిద్ పాషా,అల్లం రాజేష్ వర్మ, సంపటి సుధాకర్, డానియల్ ,భూసారపు వెంకటేశ్వర్లు, పులిషేరు వేణు, భుజగుండ్ల సంతోష్ కుమార్, చిప్ప సుధాకర్,దాసరి శ్రీనివాస్, రామకృష్ణ చారి, సుధాకర్, పూర్ణచందర్, ఎండి అమీర్, పెండెం విజయ్, అనిల్, సంతోష్, ఒంటెరి యుగేందర్, రాజేష్, చందు, కృష్ణ, పవన్, అశోక్, వహీద్ గుల్షన్, అలీమ్ డానిష్, మాషుక్ ,మున్వర్, ఫెరోజ్ ఖాన్, నిజాముద్దీన్, రషీద్, జావిద్ ,ఇమ్రాన్ ,యూనస్ తదితరులు పాల్గొన్నారు.




