Hanamkonda: నకిలీ తాకట్టు పత్రాలతో రూ.59.30 లక్షల మోసం.. ఇద్దరి అరెస్ట్!
Hanamkonda: హనుమకొండలో నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో రూ.59.30 లక్షలు కాజేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Hanamkonda: నకిలీ తాకట్టు పత్రాలతో రూ.59.30 లక్షల మోసం.. ఇద్దరి అరెస్ట్!
Hanamkonda: నకిలీ బంగారం తాకట్టు పత్రాన్ని సృష్టించి, వాస్తవంగా బంగారం తాకట్టు లేకపోయినా ఉన్నట్లు నమ్మించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్ మరియు సీఈఓ, వడ్డేపల్లి రంజిత్ (39), వ్యాపారి ఉన్నారు. పోలీసుల విచారణలో, ఇద్దరూ కలిసి కుట్ర పన్ని రంజిత్‌కు చెందిన సుమారు 640 గ్రాముల బంగారం, శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్‌లో తాకట్టు ఉన్నట్లు చూపిస్తూ నకిలీ ప్లెడ్జ్ రసీదు తయారు చేసినట్లు వెల్లడైంది.
ఆ నకిలీ పత్రాన్ని నిజమైనదిగా నమ్మించిన నిందితులు, బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి తన బ్యాంక్ నుంచి RTGS ద్వారా రూ.59,30,000/-**ను శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేసినారని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గోల్డ్ కంపెనీ ప్రతినిధులు హెచ్చరించడంతో, ఖాతాలోని నగదును ఇతర అవసరాలకు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది.
కేసు దర్యాప్తులో నిందితుల మొబైల్ ఫోన్‌లు మరియు pledge కాపీ ని స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మోసంలో మరెవరైనా ప్రమేయం ఉందా, ఇదే తరహాలో ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేశారా అనే కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది.




