Dornakal: డోర్నకల్ నియోజకవర్గంలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం!

Dornakal: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోడ్గులగూడెంలో అసంపూర్తి రోడ్డు పనుల వల్ల నీటమునిగిన 50 ఎకరాల మిర్చి పంట. నష్టపరిహారం చెల్లించాలని డోర్నకల్ ప్రాంత రైతుల డిమాండ్.

P PRABHAKAR, DORNAKAL
Published on: 7 Nov 2026 10:54 AM IST
Dornakal
X

Dornakal: డోర్నకల్ నియోజకవర్గంలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం!

Dornakal: కురవి మండలం మోడ్గులగూడెం, సూర్య తండా గ్రామాల రైతులు సాగు చేసిన మిర్చి పంట రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిపోయింది. పంట పొలాల వెంట చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టకపోవడంతో పాటు సకాలంలో పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

మోడ్గులగూడెం, సూర్య తండా గ్రామాలకు చెందిన రైతులు సుమారు 50 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. అయితే మోడ్గులగూడెం శివారులో పంట పొలాల వెంట జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో వర్షపు నీరు మోరీల ద్వారా సక్రమంగా వెళ్లకుండా పొలాల్లోకి చేరింది. దీంతో పెద్ద ఎత్తున మిర్చి పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా, సకాలంలో పూర్తి చేయాలని, వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు అవసరమైన మోరీలు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL