Valmidi: వల్మిడి రాముడికి రూ. 2 లక్షల వెండి శతగోపం బహుకరణ

Valmidi: జనగామ జిల్లా వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి భక్తురాలు వనం ఫణిరాజకుమారి రూ.2 లక్షల విలువైన వెండి శతగోపాన్ని బహుకరించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 16 Oct 2026 5:58 PM IST
Valmidi
X

Valmidi: వల్మిడి రాముడికి రూ. 2 లక్షల వెండి శతగోపం బహుకరణ

వల్మిడి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి భక్తులు సుమారు రూ.2 లక్షల విలువైన శతగోపాలను బహుకరించారు. స్వామివారి సేవలో భాగంగా భక్తులు ఈ పవిత్ర కానుకను ఆలయానికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానానికి విలువైన శతగోపాలను అందించిన దాతల సేవను ఆలయ అధికారులు గ్రామ ప్రజలు మరియు భక్తులు అభినందించాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటరెడ్డి,ఆలయ అర్చకులు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు ఆలయ సిబ్బంది మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI